బుధవారం 03 జూన్ 2020
Telangana - May 06, 2020 , 03:05:56

ఆగస్టులో వ్యాక్సిన్‌

ఆగస్టులో వ్యాక్సిన్‌

తెలంగాణలో ఫ్లాటనింగ్‌ స్టేజిలో ఉన్నాం. అంతర్జాతీయ విశ్లేషణలో ఫ్లాటనింగ్‌ అంటరు (కర్వ్‌ కిందకు తగ్గిపోవడం). దీన్ని పూర్తిగా కట్‌చేయాలి. ఇంకో మంచి వార్త ఏమిటంటే.. రాష్ట్రంలోని జీనోమ్‌వ్యాలీలో స్థాపించిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ వాళ్లు సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళం ఇవ్వడానికి వచ్చారు. వాళ్లతో నేను కాసేపు మాట్లాడాను. వారితోపాటు మొన్నీమధ్యనే హైదరాబాద్‌లో అతిపురాతనమైన బయోటెక్‌ ఫ్యాక్టరీ మన బయలాజికల్‌ ఇ (బీఈ) ఎండీ మహిమా దాట్ల వచ్చి కలిశారు, తరువాత శాంతా బయోటెక్‌ చైర్మన్‌ వరప్రసాదరెడ్డి ఉన్నారు, ఆయన చాలా గొప్పవారు. వారు కూడా చెప్పారు. చాలా సీరియస్‌గా పరిశోధన జరుగుతున్నది. ఈ ఆగస్టుకే మనకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశమున్నది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో రెండు వ్యాక్సిన్‌లు తెస్తున్నాం. వందశాతం విజయం సాధిస్తామని వారు విశ్వాసంగా చెప్పారు. అనుకున్న సమయానికి మన తెలంగాణ నుంచే.. జినోమ్‌వ్యాలీ నుంచి ఆవిష్కరణలు వస్తే చాలా గ్రేట్‌. ప్రపంచానికే మనం రిలీఫ్‌ ఇచ్చినవాళ్లమవుతాం. మనమంతా భగవంతుడిని ప్రార్థిద్దాం. ఎంత తొందరగా వ్యాక్సిన్‌వస్తే అంత తొందరగా మానవజాతి విజయం సాధిస్తది కాబట్టి అది జరగాలని మనస్పూర్తిగా కోరుకుందాం. 

ఇండ్లకే ఔషధాలు 


కోమార్బిడిస్‌ అంటే ఇతరత్రా జబ్బులు కలిగి ఉన్నవారు బయ ట తిరగవద్దు. రిస్క్‌ తీసుకోవద్దు. 65 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు బయటికి రాకుండా వారి పిల్లలు జాగ్రత్త తీసుకోవాలి. వారిన బయట తిప్పొద్దు. చిన్న పిల్లలను కూడా బయటికి రాకుండా చూసుకోవాలి.  ఇతర వ్యాధులున్నటువంటి వాళ్లు ఇప్పటికే వైద్య చికిత్స చేయించుకునేవాళ్లు షుగర్‌,బీపీ, డయాలసిస్‌లో ఉన్న కిడ్నీ రోగులు, క్యాన్సర్‌ పేషంట్లు గుండె జబ్బులున్న వారు వైద్యం చేయించుకుంటున్నారు. వారంతా వైద్యశాఖ లిస్ట్‌లో ఉన్నరు. మంత్రి ఈటల రాజేందర్‌ వారికి మూడు నెలలకు కావాల్సిన మందులు ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. వారికోసం ప్రత్యేకంగా కోటి మాస్క్‌లు ఉచితంగా వైద్యశాఖ ఇస్తుంది. logo