మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:42:04

వీధి కుక్కలకు వ్యాక్సిన్‌: తలసాని

వీధి కుక్కలకు వ్యాక్సిన్‌: తలసాని

హైదాబాద్‌, నమస్తే తెలంగాణ: వీధికుక్కలకు రేబిస్‌ వ్యాక్సి న్‌ వేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ప్రపంచ రేబిస్‌ డే సందర్భంగా సోమవారం పోస్టర్‌ను  ఆవిష్కరించారు. స్వచ్ఛంద సంస్థ ల సహకారంతో 15రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. నగర పరిధిలోని గోశాలల్లోని జీవాలకు సంచార వైద్య సేవలు అందిస్తున్నామని, అవసరమైన పశుగ్రాసం సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. logo