సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 03:43:42

తొలుత ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కే వ్యాక్సిన్‌

 తొలుత ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కే వ్యాక్సిన్‌

  • జాబితా తయారీకి అధికారులకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాక్సిన్‌ తొలుత ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కే ఇవ్వనున్నామని, ఇందుకు ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితో జాబితాను తయారు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీ మొదటి సమావేశం జరిగింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి కోల్డ్‌ చైన్‌ సౌకర్యాలు, రవాణా, వైద్య సిబ్బంది శిక్షణ, లాజిస్టికల్‌ ఏర్పాట్లు, ఐఈసీ ప్రచారం, వైద్య సౌకర్యాలు మ్యాపింగ్‌ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మొదటి దశ వ్యాక్సినేషన్‌ కోసం సంబంధితశాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, అడిషనల్‌ డీజీ జితేందర్‌, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సవ్యసాచి ఘోష్‌, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, మైనార్టీశాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీం, గిరిజనశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, శిశుసంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితరులు పాల్గొన్నారు.