సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:50:28

‘టీకా’కూ ఓ లెక్కుంది!

‘టీకా’కూ ఓ లెక్కుంది!

  • వ్యాక్సిన్‌ తయారీ అంత సులువు కాదు 
  • టీకా అభివృద్ధికి సగటున 102 ఏండ్లు పట్టొచ్చు
  • రుబెల్లా వ్యాక్సిన్‌కు పట్టిన వ్యవధి 229 ఏండ్లు 
  • కలరాకు 119 ఏండ్లు, పోలియోకు 50 ఏండ్లు 

కలరా: కలుషిత నీటి ద్వారా వ్యాపించే ఈ మహమ్మారి కొన్ని శతాబ్దాల క్రితం నుంచి ప్రబలుతూ వస్తున్నది. అయితే, 1817లో దేశంలోని గంగానదీ తీరం వెంబడి కోల్‌కతాలో మొదలైన ఈ మహమ్మారి క్రమంగా రష్యా, ఐరోపా, అమెరికాకు వ్యాపించింది. కోట్ల మంది ప్రాణాల్ని తీసింది. కాగా స్పెయిన్‌కి చెందిన జ్యూమ్‌ ఫెరాన్‌ అనే పరిశోధకుడు కలరా నియంత్రణకు 1884లో ఓ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. అయితే 2000 తర్వాత కలరా కట్టడికి అభివృద్ధి చేసిన ‘వ్యాక్స్‌కోరా’ అనే టీకాకు మాత్రమే అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) 2016లో అనుమతులనిచ్చింది. 

మహమ్మారులు మానవాళిపై పంజా విసురుతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు టీకాలను కూడా అభివృద్ధి చేశారు. అయితే ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. ఏండ్లకు ఏండ్ల సమయం పట్టింది. ఏదైనా ఒక మహమ్మారిని అంతం చేయడానికి సాయపడే టీకా అభివృద్ధికి సగటున 102 ఏండ్ల సమయం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 విశ్వమారి పీచమణిచే వ్యాక్సిన్‌ను ఏడాదిలోపే తీసుకురావడానికి నిర్విరామంగా పరిశోధనలు జరుగుతున్న ఈ తరుణంలో.. గతంలో మానవజాతిపై విరుచుకుపడ్డ అంటువ్యాధులు, మహమ్మారులు.. వాటి వ్యాక్సిన్‌ల అభివృద్ధికి పట్టిన సమయంపై ప్రత్యేక కథనం.. 

 కలరా తీవ్రతరం: 1817

వ్యాక్సిన్‌ అభివృద్ధి: 2016

టీకా అభివృద్ధికి పట్టిన సమయం: 119 ఏండ్లు


ఇన్‌ఫ్లూయెంజా: వైరస్‌ కారణంగా వ్యాప్తి చెందే ఈ మహమ్మారి వల్ల 1918-19లో నాలుగు నుంచి ఏడు కోట్ల మంది మృత్యువాతపడ్డారు. థామస్‌ ఫ్రాన్సిస్‌ జూనియర్‌, జోనస్‌ సాల్క్‌ అనే శాస్త్రవేత్తలు 1945లో ఇన్‌ఫ్లూయెంజా ప్రాథమిక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. 

రుబెల్లా: ఈ వైరస్‌ వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ముఖ్యంగా గర్భిణిలకు ఈ వ్యాధి ప్రమాదకరం. తల్లి ద్వారా కడుపులో ఉండే బిడ్డకు ఈ  వైరస్‌ సోకితే గర్భస్రావం కావొచ్చు. శిశువు పుట్టాక చనిపోవచ్చు. 1740లో తొలిసారిగా గుర్తించిన రుబెల్లాకు.. 1969లో టీకా అందుబాటులోకి వచ్చింది. 


logo