e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌

విద్యుత్తు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌

విద్యుత్తు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌
  • ప్రారంభించిన సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 14 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ నిరంతరాయంగా కరెంట్‌ సరఫరాచేస్తున్న విద్యుత్తు ఉద్యోగులను కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లుచేసినట్టు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం విద్యుత్తు సౌధ, మింట్‌ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్‌ కార్యాలయాల్లో మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోరిన వెంటనే విద్యుత్తు ఉద్యోగులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌కు ఆదేశించిన సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మూడురోజులపాటు 50 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి టీకాలు వేస్తామని వివరించారు. వ్యాక్సినేషన్‌కు ఆదేశాలిచ్చిన సీఎం కేసీఆర్‌కు, ప్రక్రియను ప్రారంభించిన ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావుకు విద్యుత్తు అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ అంజయ్య, టీఎస్‌పీఈఏ అధ్యక్ష కార్యదర్శులు పీ రత్నాకర్‌రావు, పీ సదానందం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఎండీ శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు నర్సింగరావు, జగత్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌, బీ నర్సింగరావు, సచ్చిదానందం, వెంకటరాజం, అశోక్‌కుమార్‌, లక్ష్మయ్య, అజయ్‌, డాక్టర్‌ టీఆర్‌కే రావు, ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విద్యుత్తు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌
విద్యుత్తు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌
విద్యుత్తు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌

ట్రెండింగ్‌

Advertisement