గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 01:23:56

టీకా వేశాక సర్టిఫికెట్‌

టీకా వేశాక సర్టిఫికెట్‌

  • క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ధ్రువపత్రం జారీ 
  • వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం త్వరలో యాప్‌
  • ప్రజలకోసం రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు 
  • సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌, వాట్సాప్‌ చాట్‌బోట్‌

హైదరాబాద్‌, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్‌ తర్వాత క్యూఆర్‌ కోడ్‌తో కూ డిన ఒక ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. ఇది కేంద్రం రూపొందించిన డిజిలాకర్‌ యాప్‌లోనూ కనిపించనున్నది. ఈ ఏర్పాటుతో దేశంలో ఎంతమందికి వ్యాక్సిన్‌ చేరిందో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ వేదికగా దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ జరుగనున్నది. ఇందులో పేరు నమోదుచేసుకొంటేనే వ్యాక్సిన్‌ అందుతుంది. దీని కోసం త్వరలోనే ఆం డ్రాయిడ్‌, ఐవోఎస్‌ వర్షన్‌లో కొవిన్‌ యాప్‌ అందుబాటులోకి రానున్నది. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా యాప్‌డౌన్‌ లోడ్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సొంతంగా నిర్వహించుకోవాల్సి ఉంటుం ది. తొలుత వివరాలు నమోదు చేయగానే యూనిక్‌ హెల్త్‌ ఐడీ క్రియేట్‌ అవుతుంది. దీని ఆధారంగా ఏ రోజు, ఎప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవాలో సూచించేలా మొబైల్‌కు సందేశం వస్తుంది. ఇంగ్లిష్‌, హిందీతోపాటు మొత్తం 12 భాషల్లో ఈ సందేశాలు చేరేలా ఏర్పాటుచేశారు. ఈ వివరాలు భద్రంగా ఉండేలా డిజిలాకర్‌తో అనుసంధానంచేశారు. వ్యాక్సిన్‌ వేసుకున్నాక క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ అందుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 78.62 లక్షల మంది వైద్యారోగ్య సిబ్బంది కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, రాష్ట్రంలో 2.8 లక్షల మంది నమోదు చేసుకొన్నారు. 

దేశవ్యాప్తంగా తొలిదశలో వ్యాక్సిన్‌ పొందేవారు.. 

  • హెల్త్‌ కేర్‌ వర్కర్లు- కోటి (ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సిబ్బంది)
  • ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు- 2 కోట్లు (పోలీసు, రక్షణ, మున్సిపల్‌, జైళ్లశాఖ)
  • ప్రాధాన్యత వర్గం- 27 కోట్లు (50 ఏండ్లలో పు, 50ఏండ్ల లోపు ఉన్న కోమార్బిడిటీస్‌)

24 గంటల హెల్ప్‌లైన్‌ 

వ్యాక్సిన్‌పై సందేహాలు తీర్చేందుకు 24 గంటలపాటు సేవలందించే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఆయారాష్ట్రాల్లో ప్రత్యేక నంబర్లతోపాటు దేశం మొత్తానికి ఒక హెల్ప్‌లైన్‌ నంబర్‌ అందుబాటులోకి రానున్నది. వాట్సాప్‌ చాట్‌బోట్‌నూ ప్రా రంభిస్తారు. దేశవ్యాప్తంగా 1,075, రాష్ట్రవ్యాప్తం గా 104 హెల్ప్‌లైన్‌ నంబర్లు కొవిడ్‌ సంబంధిత అన్ని సమస్యలకు సమాధానాలు ఇస్తాయి. logo