ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చిన యాదగిరీశుడు

హైదరాబాద్ : యాదగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. వేకువ జాము నుంచే స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల పూలతో అలంకరించారు. ఆలయంలో ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే శుక్రవారం నుంచి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆరు రోజుల పాటు వైభవోపేతం కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రోజుకో అవతారంలో స్వామి వారు భక్తులను కటాక్షించనున్నారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కనులపండువలా జరిగాయి. ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చిన స్వామి వారిని భక్తులు దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు.
తాజావార్తలు
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
- ఎగ్ ఫేస్ మాస్క్‌తో ఎన్నో లాభాలు..