మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 20:05:33

ఉత్త‌మ్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి : మ‌ంత్రి హ‌రీశ్‌

ఉత్త‌మ్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి : మ‌ంత్రి హ‌రీశ్‌

సిద్దిపేట : భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న సుజాతకు తోబుట్టువులా ఉంటాన‌న్నారు. సోదరుడిలా సహకరిస్తా అని తానంటే ఆమె అసమర్ధురాలు అనడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అన్నారు. మహిళల పట్ల ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఉన్న గౌర‌వం ఇదేనా అని మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడటం ఉత్త‌మ్‌కు సమంజసం కాదని వెంట‌నే ఆయ‌న బేషరతుగా క్షమాపణ చెప్పాల‌న్నారు. సిద్దిపేట‌ జిల్లాలోని  దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో రెడ్డి సంఘం భవన్‌లో దుబ్బాక ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్‌కు సంఘీభావ సభ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి చనిపోవడం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తుంద‌న్నారు. దుబ్బాక వైపు ఎప్పుడు కనిపించని మనుషులు, నాయకులు  ఈరోజు కనిపిస్తున్నారన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తాను, కాబోయే ఎమ్మెల్యే  సుజాత అక్క ఎన్నికలు అయిపోయాక కూడా ప్రజల వైపు ఉంటామ‌న్నారు. 

రేపు దుబ్బాకలో ఉత్తంకుమార్ రెడ్డి మహిళలకు సమాధానం చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి మహిళలు , దుబ్బాక ప్రజలు బుద్ధి చెపుతార‌న్నారు. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఏం మంచి పని చేశారో చెప్పాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేసిన ఘనత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి దక్కింద‌న్నారు. దుబ్బాకలో ఉంటున్న కాంగ్రెస్ నాయకులు ఒకసారి స్థానికంగా జరిగిన అభివృద్ధి పనులు చూడాలన్నారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం నీళ్ళు ఈ జన్మలో చూస్త‌మా అని అనడం దానికి సమాధానంగా సీఎం కేసీఆర్ నీళ్లు తేవడం మ‌న‌కు తెలిసిందేన‌న్నారు. దుబ్బాక మున్సిపాలిటీ సహకారంతో రానున్న రోజుల్లో ఆటో కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తాన‌ని మంత్రి హ‌రీశ్ పేర్కొన్నారు. logo