శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 19:20:45

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్‌ రాజీనామా

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్‌ రాజీనామా

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష ప‌ద‌వికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నిక‌ల్లో ఓట‌మికి నైతిక బాధ్య‌త వహిస్తూ రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు. శుక్రవారం వెల్లడైన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఫిబ్రవరి 2015 నుంచి ఉత్తమ్‌ టీపీసీసీ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.