శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 16:47:39

ఇరిగేషన్ పనులకు ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలి

ఇరిగేషన్ పనులకు ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలి

మహబూబ్‌నగర్‌ : ఇరిగేషన్ పనులకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులు, ఆయకట్టు దారులను కోరారు. చిన్న నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన పనులపై ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖ ద్వారా చెరువుల గట్లపై, కట్టలపై హరితహారం కింద మొక్కలను నాటాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. హరితహారం  కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పారు. వచ్చే సంవత్సరం చిన్న నీటి పారుదల శాఖ ద్వారా లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు.

ఉపాధి హామీ పథకం నిధులతో నీటిపారుదల శాఖలో చాలా పనులు చేయడానికి ఆస్కారం ఉందని.. అందువల్ల కూలీలను ప్రోత్సహించి ఇరిగేషన్ పనులు చేపట్టాలని సూచించారు. ఇందుకుగాను అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్లకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి పనులు అప్పగించాలని చిన్న నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నర్సింగ్ రావు, డీఆర్‌డీవో వెంకట్ రెడ్డిలను ఆదేశించారు. చెరువు కట్టలను పటిష్టపరచడం, ఫీడర్ ఛానల్ తదితర పనులన్నీ ఉపాధిహామీ కూలీల ద్వారా చేసేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు.