శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 20:25:09

పనిలో బిజీగా ఉన్నప్పుడు ఇవి వాడండి!

పనిలో బిజీగా ఉన్నప్పుడు ఇవి వాడండి!

ఉదయాన్నే లేచి మేకప్‌ సామాను వేసుకోవడానికి ఒక చిన్న బ్యాగు కావాలి. ఆ తర్వాత లంచ్‌ బాక్స్‌ కోసం మరొక బ్యాగ్‌. ఇతర ఆఫీస్‌లో పనికొచ్చే ఫైల్స్‌, ఇతర అవసరాలకు మరొక బ్యాగ్‌ సర్దుకోవాలి. కానీ అన్నీ ఒకే బ్యాగులో పట్టేలా ఉంటే బాగుంటుంది కదా!. ఒక బ్యాగు తీసుకున్నప్పుడు మరొక బ్యాగును ఇంట్లో మరువడమో, ఆఫీసులో మరిచిపోవడమో కామన్‌. అలాంటప్పుడు అన్నీ కలిపి ఒకే బ్యాగులో సర్దేస్తే పోలా?! రెగ్యులర్‌ బ్యాగులను పక్కకు పెట్టి ఇప్పుడు ఈ పెద్ద బ్యాగులకు ఓటేస్తున్నారు అమ్మాయిలు. బిజీ లైఫ్‌లో గజిబిజి లేకుండా ఉండేందుకు ఈ బ్యాగులను ఎంచుకోండి. ఈ బ్యాగుల్లో ఏఏ రకాలు ఉన్నాయో తెలుసుకోండి. 

  • పువ్వుల డిజైన్‌తో వచ్చినవి చాలా ఇప్పుడు అమ్ముడుపోతున్నాయి. వీటికి ఎక్స్‌ట్రా బ్యాగ్‌ కూడా వస్తుంది. దీన్ని మేకప్, ఇతర ముఖ్యమైన పేపర్‌ల కోసం వాడుకోవచ్చు. ఈ బ్యాగును కూడా పెద్ద బ్యాగులో వేసుకోవచ్చు.
  • ఇలాంటి బ్యాగుల్లో ఎక్కువ జిప్‌లు వస్తాయి. దీనివల్ల మీరు ఆర్గనైజ్డ్‌గా వస్తువులను సపరేట్‌ చేసుకోవచ్చు. లెదర్‌తో తయారయ్యే టోటే బ్యాగుల్లో ఈ రంగు బ్యాగులను ఎక్కువగా కొంటున్నారట.
  • మామూలు ప్లెయిన్‌ డిజైన్‌ కాకుండా.. ఎనిమల్‌ ప్రింట్‌తో వచ్చిన బ్యాగుల కొన్ని అకేషన్లలో మిమ్మల్ని సపరేట్‌గా నిలుపుతాయి. ఉదాహరణకు ఆఫీసు నుంచి ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లాల్సి వస్తే ఈ ప్రింట్‌ బ్యాగులను ఎంచుకోవచ్చు.
  • బ్లాక్‌ కలర్‌ బ్యాగులు అన్ని అకేషన్లకు బాగుంటాయి. స్టైలిష్‌ లుక్‌ కోసం, ఏ డ్రెస్‌ మీదకైనా మ్యాచింగ్‌ అవ్వాలంటే ఈ రకం బ్యాగులను ఎంచుకోవాల్సిందే!
  • కొన్ని రంగులు స్పెషల్‌గా ఉంటాయి. ఇంగ్లిష్‌ రంగులని వీటికి పేరు. ఈ రంగులతో వచ్చే బ్యాగులు ఒకే రంగులో కాకుండా హ్యాండిల్స్‌ వేరే రంగుల్లో వస్తాయి. వెస్ట్రన్‌ డ్రెస్‌ల మీదకి ఇవి బాగా నప్పుతాయి.
  • సరికొత్త ట్రెండ్‌ అంటే పోల్కా డాట్స్‌. రంగు రంగుల చుక్కలతో బ్యాగు మొత్తం నిండిపోయి ఉంటుంది. బోల్డ్‌ లుక్‌ కోసం ఈ బ్యాగులను ఎంచుకోవచ్చు.
  • వేసవిలో ఈ బ్యాగులు క్యారీ చేయడం కాస్త కష్టం. కాకపోతే ఫంక్షన్లకు వెళ్లినప్పుడు స్టైలిష్‌గా ఉంటాయి. ఫర్‌తో చేసిన ఈ మెత్తటి బ్యాగులు స్టైల్‌కి నిర్వచనంలా నిలిచిపోతాయి. 


logo