శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:00:30

అమెరికాలో మన అంజన్న

అమెరికాలో మన అంజన్న

  • వరంగల్‌లోని అమ్మవారిపేటలో తయారీ 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  వరంగల్‌ జిల్లాలో రూపుదిద్దుకున్న అభయాంజనేయస్వామి విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్ఠించారు. 25 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని వరంగల్‌కు చెందిన శిల్పి రాజు చెక్కారు. అమెరికాలోని డెలావేర్‌ రాష్ట్రం హకెసిన్‌లోగల మీనాక్షి దేవాలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడి హిందూ దేవాలయ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాటిబండ శర్మ బృందం సూచన మేరకు హన్మకొండ మండలం అమ్మవారిపేటలోని క్వారీలో ఈ విగ్రహాన్ని రాజు పదిమంది శిల్పుల సహకారంతో ఏడాదిపాటు శ్రమించి రూపొందించారు. 30 టన్నుల బరువున్న ఏకశిలతో సుందరంగా మలిచారు. ఈ విగ్రహాన్ని జనవరిలో అమెరికాకు తరలించారు. కాగా ఈనెల 11న ప్రత్యేక పూజలు నిర్వహించి అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమెరికాలో ప్రతిష్ఠించిన హిందూ దేవతా విగ్రహాల్లో ఆంజనేయ స్వామి విగ్రహమే అత్యంత ఎత్తయినదని ప్రవాస భారతీయులు పేర్కొంటున్నారు. 


logo