బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:48:04

అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై వీడని ఉత్కంఠ

అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై వీడని ఉత్కంఠ

  • ట్రంప్‌కు 213, బిడెన్‌కు 238 ఎలక్టోరల్‌ ఓట్లు
  • కీలక రాష్ర్టాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • భారీగా ‘మెయిల్‌ ఇన్‌ ఓట్ల’తో కౌంటింగ్‌ ఆలస్యం

వాషింగ్టన్‌, నవంబర్‌ 4: అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని ఉత్కంఠ.. సందిగ్ధత. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నది. ఫలితాలను తారుమారు చేయగల స్వింగ్‌ రాష్ర్టాల్లో ఇంకా కౌంటింగ్‌ సాగుతున్న నేపథ్యంలో ఈసారి శ్వేతసౌధంలో కొలువుదీరేది ఎవరన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొన్నది. 

ట్రంప్‌ గెలుపొందిన రాష్ర్టాలు

అలబామా (9), అర్కాన్సాస్‌ (6), ఫ్లోరిడా (29) ఇదహో(4), ఇండియానా (11), అయోవా(6), కాన్సస్‌ (6), కెంటకీ (8), లూసియానా (8), మిసిసిప్పీ (6), మిస్సోరి (10), మోంటానా (3), నెబ్రాస్కా (4), నార్త్‌ డకోటా (3), సౌత్‌ డకోటా (3), ఓహియో  (18), ఓక్లహామా (7), సౌత్‌ కరోలినా (9), టెన్నెసీ (11), టెక్సాస్‌ (38),  ఉతా (6), వ్యోమింగ్‌ (3), వెస్ట్‌ వర్జీనియా (5)

బిడెన్‌ గెలుపొందిన రాష్ర్టాలు

ఆరిజోనా (11), కాలిఫోర్నియా (55), కొలొరాడో (9), కనెక్టికట్‌ (7), ), డెలావర్‌ (3), డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా (3), హవాయి (4), ఇల్లినాయిస్‌ (20), మెయిన్‌ (3), మేరీల్యాండ్‌ (10), మసాచూసెట్స్‌ (11), మిన్నెసోటా (10), నెబ్రాస్కా (1), న్యూ హ్యాంప్‌షైర్‌ (4), న్యూజెర్సీ (14), న్యూ మెక్సికో (5), న్యూయార్క్‌ (29), ఓరెగాన్‌ (7), రోడ్‌ ఐలాండ్‌ (4), వెర్మౌంట్‌ (3), వాషింగ్టన్‌ (12), వర్జీనియా (13)

ఫలితం తేలాల్సిన రాష్ర్టాలు

అలస్కా(3), జార్జియా(16), నార్త్‌ కరోలినా(15), పెన్సిల్వేనియా(20) (వీటిల్లో ట్రంప్‌ ఆధిక్యం)

 మిషిగన్‌(16), నెవాడ(6), విస్కాన్సిన్‌(10) (ఈ రాష్ర్టాల్లో బిడెన్‌ ఆధిక్యం)