బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 01:54:54

స్వీయ నిర్బంధంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే

స్వీయ నిర్బంధంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌ టౌన్‌: పదిహేను రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవారం నుంచి తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్‌ సోకలేదని తేల్చారు. దీంతో ఆయన ఈ నెల 18న కాగజ్‌నగర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విదేశాల నుంచి తిరిగివచ్చినవారు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాటించడంలేదని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. 19న వైద్యాధికారులు ఎమ్మెల్యేను మరోసారి పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్టు తేల్చారు. ముందుజాగ్రత్తకోసం 12 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని సూచించడంతో ఎమ్మెల్యే ఇంటికే పరిమితమయ్యారు.


logo