శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 19:23:56

'రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి అర్బన్ ఫారెస్ట్ పార్కులు'

'రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి అర్బన్ ఫారెస్ట్ పార్కులు'

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేపటి నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కు లు ప్రజలకు అందుబాటులోకి  రానున్నాయని  అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నగర పట్టణ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  కొవిడ్ నిబంధనలను అనుసరించి సందర్శకులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు. మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా  అక్టోబర్ 6 (జూ డే) నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ లోకి సందర్శకులను అనుమతించనున్నట్లు మంత్రి చెప్పారు. వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ఉన్న చోట నీటిని తొలగించి, పార్కు ను పూర్తిగా శుభ్రపరచాలని జూ అధికారులను ఆదేశించారు. అన్ని రాష్ట్రాల అటవీ పర్యావరణ మంత్రుల సమావేశంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  అర్బన్ ఫారెస్ట్ పార్కులను  తెరవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కోరిన సంగతి తెలిసిందే.