బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 15:29:28

హెచ్‌సీయూ దరఖాస్తుల గడువు పొడిగింపు

హెచ్‌సీయూ దరఖాస్తుల గడువు పొడిగింపు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ప్రవేశాల కోసం యూనివర్సిటీ అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం విదితమే. అయితే నేటితో దరఖాస్తుల గడువు ముగియనుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్‌ 30వ తేదీ వరకు గడువును పొడిగించారు. రాబోయే విద్యా సంవత్సరంలో 132 కోర్సుల్లో 2,456 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 41 పీజీ కోర్సులు, 15 ఎంఫిల్‌ కోర్సులు, 10 ఎంటెక్‌ కోర్సులు, 46 పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇతర వివరాల కోసం www.acad.uohyd.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. 


logo