శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 12:19:06

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో దారుణ హ‌త్య‌

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో దారుణ హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో దారుణ హ‌త్య జ‌రిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్ల‌ర్ నంబ‌ర్ 161కి స‌మీపంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భించింది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత‌డి త‌ల‌పై బండ‌రాయితో మోది హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ ప్రాంతంలో డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు చేశారు పోలీసులు. క్లూస్ టీం ఆధారాలు సేక‌రించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo