శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 14:43:33

కొదురుపాక బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని శవం లభ్యం

కొదురుపాక బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని శవం లభ్యం

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి వద్ద వ‌ర‌ద నీటిలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం ల‌భ్య‌మైంది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల స‌హాయంతో మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. మృతుడి వ‌య‌సు 35 సంవత్స‌రాలు ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేశారు. రంగు చామన ఛాయ, నలుపు రంగు టీ షర్ట్, బ్లూ క‌ల‌ర్ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతుడి వివ‌రాలు తెలిసిన వారు 9440900976, 9440795164,9701132172 నంబ‌ర్ల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ఎస్ఐ జీ శ్రీనివాస్ తెలిపారు.