కొండాపూర్, మే 1: పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చుతూ ది ఏషియన్ సైంటిస్ట్ 100 జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సురజిత్ ధార చోటు సంపాదించారు. హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ విభాగానికి చెందిన ఆయన.. సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేస్తున్నారు. కాగా, డాక్టర్ సురజిత్ గత ఏడాది ప్రముఖ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అందుకొన్నారు. వీటితో పాటు స్వర్ణ జయంతి ఫెలోషిప్ అవార్డు, ఎన్ఎస్ సత్య మూర్తి మెమోరియల్ అవార్డును ఫిజిక్స్ ఫర్ యంగ్ సైంటిస్ట్‌గా, ఇంటర్నేషనల్ లిక్విడ్ క్రిస్టల్ సొసైటీ ద్వారా మిచి-నకట ప్రైజ్‌లను అందుకొన్నారు.