మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 00:18:10

పీవీ మాట

పీవీ మాట

విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలు. భారతీయ సంప్రదాయంలో జ్ఞానం అంటే వివేకం. పోటీపడటానికి విజ్ఞాన సముపార్జన కాదు. విలువలు ప్రాతిపదికగా గల విద్య మాత్రమే ఉన్నత విద్యాలక్ష్యాలను నెరవేర్చగలదు. మంచి చెడు మధ్య తేడా గ్రహించడానికి తోడ్పడనిది విద్య కానే కాదని మహాత్మా గాంధీ అన్నారు.  మన దేశ రాజకీయ సామాజిక జీవనంలో విలువలు నశిస్తున్నాయి. వీటిని పునః ప్రతిష్ఠించడానికి పెద్దకార్యక్రమమే చేపట్టవలసి ఉన్నది. దీనిని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో అమలు చేయాలి. 


logo