బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 22:06:15

దీపాల వెలుగుతో ఐక్యత: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

దీపాల వెలుగుతో ఐక్యత: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

 హైదరాబాద్ : కరోనా వ్యాధిని తరిమికొట్టడంలో జాతి సమైక్యతను చాటేలా ఆదివారం రాత్రి దీపాలను వెలిగించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు రాత్రి 9 గంటలకు ఎవరి ఇంట్లో వారు విద్యుత్‌ను 9 నిమిషాలపాటు ఆపేసి దీపాలు, కొవ్వొత్తి వెలిగించాలని, టార్చ్‌లైట్‌, మొబైల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ను వేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు గుంపులుగా రావద్దని, రోడ్లపైకి వెళకూడదన్నారు. ప్రజలు తమ ఇండ్ల ద్వారాలు, బాల్కనీలోనే ఉండి దీపాలు వెలిగించాలని సూచించారు.  


logo