బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 07, 2020 , 14:15:33

నిజామాబాద్ జడ్పీ చైర్మన్ తో మాట్లాడిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి

నిజామాబాద్ జడ్పీ చైర్మన్ తో మాట్లాడిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి

నిజామాబాద్ : జిల్లా పరిషత్ ఛైర్మన్ తో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డులకు ఎంపికైన వారితో స్వయంగా ముచ్చటించారు.  స్థానిక సంస్థల బలోపేతం కోసం కృషి చేస్తున్నందుకు జడ్పీ చైర్మన్ ను అభినందించారు.

గ్రామ, మండల, జిల్లా పరిషత్ లు నవ భారత నిర్మాణానికి పునాది లాంటిదని కేంద్ర మంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ జిల్లా పరిషత్ గా  నిజామాబాద్ ఎంపిక చేసినందుకు గాను కేంద్ర మంత్రికి జడ్పీ చైర్మన్ విఠల్ రావు ధన్యవాదాలు తెలిపారు.


logo