గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:33

సింగరేణికి కేంద్రమంత్రి ప్రశంస

సింగరేణికి కేంద్రమంత్రి ప్రశంస

  • సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు నిర్ణయంపై హర్షం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని భారీ జలాశయాలపై తేలియాడే సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని సింగరేణి చేస్తున్న ప్రయత్నాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి ప్రశంసించారు. బొగ్గు ఉత్పత్తికి అదనంగా నూతన విధానంలో సోలార్‌పవర్‌ ఉత్పత్తిచేయడం ఆహ్వానించదగ్గ విషయమని ట్విట్టర్‌లో కొనియాడారు. 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం సింగరేణి, టీఎస్‌ రెడ్కోతో కలిసి చర్యలు చేపడుతున్నది.


logo