బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 03:04:46

పకడ్బందీగా ఆత్మనిర్భర్‌

పకడ్బందీగా ఆత్మనిర్భర్‌

  • ఎస్‌ఎల్‌బీసీ అధికారులతో సమీక్ష సమావేశంలో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రం లో ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పకడ్బందీగా అమలయ్యేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో ఎస్‌ఎల్‌బీసీ, ఎఫ్‌సీఐ, వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి కిషన్‌రెడ్డి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం వీధి వ్యాపారులకు చెక్కులు పంపిణిచేశారు. తరువాత మంత్రి సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానను సందర్శించారు. అక్కడ కరోనా రోగులను పరామర్శించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించాలని అన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు 600 వెంటిలేటర్లు పంపించామని, ఇంకా ఏం కావాలన్న కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు. నోడల్‌ కేంద్రమైన గాంధీ దవాఖానలో 250 వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయన్నారు. తెలంగాణాలో తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడుతూనే ఉన్నానని అన్నారు.  


logo