ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 22:03:30

సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంమంత్రి ప్రశంసలు..

సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంమంత్రి ప్రశంసలు..

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు గానూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు.. ‘జనతా కర్ఫ్యూ’ను రాష్ట్రంలో అద్భుతంగా నిర్వహించారని ఆయన సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. జనతా కర్ఫ్యూను అద్భుతంగా నిర్వహించి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారని హోం మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.

జనతా కర్ఫ్యూ నిర్వహణలో తెలంగాణ ప్రజల స్ఫూర్తి, ప్రభుత్వ యంత్రాంగం చొరవ ప్రశంసించదగినదని ఈ సందర్భంగా హోం మంత్రి అన్నారు. ఇదే స్ఫూర్తిని మరిన్ని రోజులు కొనసాగించి కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలని అమిత్‌ షా.. సీఎంకు తెలిపారు.


logo