శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 16:44:46

బ‌స్తీ ద‌వ‌ఖానాల్లో క‌రోనా ప‌రీక్షల‌పై కేంద్రం హ‌ర్షం

బ‌స్తీ ద‌వ‌ఖానాల్లో క‌రోనా ప‌రీక్షల‌పై కేంద్రం హ‌ర్షం

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారిపై రాష్ర్ట ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ, నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికార యంత్రాంగానికి సూచ‌న‌లు చేస్తోంది. క్ర‌మ‌క్ర‌మంగా రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గిపోతోంది. ఇక రాష్ర్ట వైద్యారోగ్య శాఖ‌ ప్రాథ‌మిక‌, ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాల‌తో పాటు బ‌స్తీ ద‌వ‌ఖానాల్లోనూ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. బ‌స్తీ ద‌వ‌ఖానాల్లో కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంపై కేంద్రం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. 

క‌రోనా నియంత్ర‌ణ‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ కాన్ఫ‌రెన్స్‌లో 12 రాష్ర్టాల సీఎస్‌లు పాల్గొన్నారు. ఆయా రాష్ర్టాల్లో కొవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై స‌మీక్షించారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొని.. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప‌క‌డ్బందీ చ‌ర్య‌ల‌ను కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి అభినందించారు. కొవిడ్ మ‌ర‌ణాలు తెలంగాణ‌లో జాతీయ స‌గ‌టు క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ప్రాథ‌మిక‌, ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాల‌తో పాటు బ‌స్తీ ద‌వ‌ఖానాల్లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయడంపై కేంద్రం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. 

రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గ‌డం మొద‌లైంద‌ని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచామ‌ని చెప్పారు. ల‌క్ష‌ణాలు ఉండి యాంటీజెన్‌లో నెగిటివ్ వ‌స్తే ఆర్టీపీసీఆర్ కూడా చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోని అన్ని ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌న్నారు. ఆక్సిజ‌న్ సౌక‌ర్యం క‌ల్పించేందుకు ప్ర‌త్యేక వ్యూహం అమ‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. జిల్లాల్లో వ్యాపిస్తున్న కొవిడ్ నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తున్నామ‌ని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 


logo