బెంగళూరు,జూన్ 28: కొవీసెల్ఫ్ టెస్ట్ కిట్ల అమ్మకాలు ఫ్లిప్కార్ట్లోనూ మొదలయ్యాయి. 2 నుంచి18 ఏండ్ల వారికి కూడా పరీక్షలు చేయొచ్చు. ఇది ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు కనీసం రెండు ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఈ యాంటీజెన్ కిట్ లో సేఫ్ స్వాబ్,టెస్ట్ కార్డ్, ప్రీఫిల్ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్, డిస్పోజబుల్ బ్యాగ్,యూజర్ మ్యానువల్ ఉంటాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 24నెలలు.
పూణెకు చెందిన కంపెనీ ఈ కిట్ రెడీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టెస్టు చేయడానికి రెండు నిమిషాల సమయం పట్టడంతో పాటు ఫలితం కోసం15నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. రాబోయే వారం చివరి నాటికి అందుబాటులో ఉంటుంది. ఇండియా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల ఆన్ లైన్ ఫార్మసీల్లో దొరుకుతుంది.