శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 26, 2020 , 02:59:42

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..

  • కరోనా పీక్‌ స్టేజికి వేర్వేరు కాల వ్యవధి
  • ఢిల్లీలో ఈ నెలాఖరుకే..
  • తెలంగాణ, ఏపీ, తమిళనాడుల్లో వచ్చే నెలలో
  • ఐఐపీహెచ్‌ డైరెక్టర్‌ జీవీఎస్‌ మూర్తి వెల్లడి

హైదరాబాద్‌, జూలై 25: దేశంలో కరోనా విస్తరణ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీహెచ్‌) డైరెక్టర్‌ జీవీఎస్‌ మూర్తి అన్నారు. కొన్ని రాష్ర్టాల్లో వైరస్‌ వ్యాప్తి తారస్థాయికి (పీక్‌స్టేజికి) చేరితే మరికొన్ని రాష్ర్టాల్లో ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతున్నదని పేర్కొన్నారు. ఢిల్లీలో వైరస్‌ విస్తరణ ఈ నెల చివరికి లేదా వచ్చే నెల మొదటివారం నాటికి పీక్‌స్టేజికి చేరుతుందని, మహారాష్ట్రలో సెప్టెంబర్‌ నాటికి ఆ స్థాయిని అందుకుంటుందని అభిప్రాయపడ్డారు. హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో సెప్టెంబర్‌ మధ్యనాటికి అత్యధిక కరోనా కేసులు నమోదవుతాయని తెలిపారు (పీక్‌ స్టేజీ తరువాత కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడతాయి). కొన్ని రాష్ర్టాల్లో కట్టడి చర్యలు ఆపటంతో వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నదని అందుకు కేరళనే ఉదాహరణ అని పేర్కొన్నారు. 


logo