బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:08

కంటెయినర్లనే తస్కరించారు..

కంటెయినర్లనే తస్కరించారు..

  • ఆపై కూలీలను తరలిస్తూ దొరికారు

అడ్డాకుల: గుర్తుతెలియని వ్యక్తులు రెండు కంటెయినర్‌ వాహనాలను తస్కరించి వాటిలో బీహార్‌కు కూలీలను తరలిస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల పోలీసులకు చిక్కారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వల్సూర్‌ ప్రాంతంలో గురువారం రాత్రి కంటెయినర్‌ వాహనాలను  దొంగిలించిన వ్యక్తులు బీహార్‌కు చెందిన 80 మంది వలస కూలీలను ఎక్కించుకొని బయల్దేరారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున వసూలుచేశారు. వాహనాల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు టోల్‌ప్లాజాల దగ్గర సీసీ ఫుటేజీలను పరిశీలించి  వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వెంటనే తెలంగాణ పోలీసులకు అప్రమత్తం చేయగా అడ్డాకుల టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. అందులో బీహార్‌కు చెందిన 80 మంది కూలీలను గుర్తించారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్న క్రమంలో డ్రైవర్లు పారిపోయారు.  


logo