సోమవారం 01 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:40:45

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

 రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

కాచిగూడ : పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతుండగా.. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృ తి చెందాడు. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(35)  యాకత్‌పుర-ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతున్నా డు. అదే సమయంలో గూడ్స్‌ రైలు వచ్చి ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు.  సంబంధీకులు ఎవరైనా ఉంటే 814380 7592లో సంప్రదించాలని పోలీసులు కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. logo