గురువారం 04 జూన్ 2020
Telangana - May 01, 2020 , 07:29:38

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని లారీ: ఇద్దరు మృతి

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని లారీ: ఇద్దరు మృతి

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో కరీంనగర్‌ ప్రధాన రహదారిపై దరూర్‌ వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని లారీ ఆటోను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కోరుట్ల వాసులు లోకిని గంగాధర్‌, లోకిని రాజర్వలుగా గుర్తించారు. ఆటోలో ఉల్లిపాయలు వేసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా పోలీస్‌ క్యాంపు వద్ద రోడ్డుపై ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.


logo