సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 01:56:51

పలుజిల్లాల్లో అకాల వర్షం

పలుజిల్లాల్లో అకాల వర్షం

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. వరంగల్‌, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో దాదాపు రెండు గంటలపాటు కురిసిన వర్షంతో హన్మకొండలోని రోడ్లు జలమయమయ్యాయి. ధర్మసాగర్‌, కాజీపేట మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆరబోసిన మిర్చి తడిసింది. నల్లగొండ జిల్లాకేంద్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, చండూ రు, నకిరేకల్‌, కట్టంగూరు మండలాల్లో జల్లు లు పడ్డాయి. సూర్యాపేట జిల్లాకేంద్రం, చివ్వెం ల మండలంలో గంటపాటు ఎడతెరిపిలేకుం డా వర్షం పడింది. సూర్యాపేట మార్కెట్‌లో కాంటా పూర్తయిన కందుల బస్తాలు తడిసిపోగా.. అప్రమత్తమైన రైతులు టార్ఫాలిన్లు కప్పడంతో నష్టం తగ్గింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షంతో ఆరబోసిన మిర్చి తడిసింది.  


logo