e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home తెలంగాణ అనుమతుల్లేని ప్రాజెక్టులు ఆపెయ్యాలి

అనుమతుల్లేని ప్రాజెక్టులు ఆపెయ్యాలి

  • కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

హైదరాబాద్‌, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలు అనుమతుల్లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణ పనులను తక్షణమే ఆపేయాలని, ఆరు నెలల్లోగా వాటికి అనుమతులు తెచ్చుకోవాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మరోసారి స్పష్టంచేశారు. అనుమతుల్లేకుండా పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణను కూడా ఆపేయాల్సి ఉంటుందని చెప్పారు. గురువారం లోక్‌సభలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుగు రాష్ర్టాల్లో కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మంత్రి షెకావత్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. అనుమతుల్లేని ప్రాజెక్టులకు నిధులనిచ్చే లోపభూయిష్టమైన వ్యవస్థను సరిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని అనుసరించి కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశామని, ఆ బోర్డులు సమర్థవంతంగా పనిచేస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana