శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 14:51:21

ప్రముఖ కవి ఉమాపతి బాలాంజనేయశర్మ కన్నుమూత

ప్రముఖ కవి ఉమాపతి బాలాంజనేయశర్మ కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ కవి, నాటక రచయిత, రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యవిద్యలో ప్రవీణులు శ్రీ ఉమాపతి బాలాంజనేయశర్మ ఈ ఉదయం కన్నుమూశారు. బాలాంజనేయశర్మ మృతి పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఆయన మృతి సాహిత్య, సాంస్కృతిక రంగాలకు తీరని లోటు అని అన్నారు. బాలాంజనేయశర్మ రాసిన భువన విజయం పద్యనాటకం జాతీయస్థాయిలో దూరదర్శన్‌ ద్వారా ప్రసారమై ప్రశంసలు పొందిందన్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు మంత్రి  పేర్కొన్నారు.


logo