శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 09:19:21

భక్తులు లేకుండానే ఉజ్జయిని మహంకాళీ బోనాలు

భక్తులు లేకుండానే ఉజ్జయిని మహంకాళీ బోనాలు

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే బోనాల వేడుక జరుగుతుండడం ఇదే మొదటిసారి. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. బోనాల సందర్భంగా లష్కర్‌ ప్రాంతంలో రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. నార్త్‌జోన్‌లోని గోపాలపురం, చిలకలగూడ, లాలాగూడ, తుకారాంగేట్‌, మహంకాళి, మార్కెట్‌, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట్‌, తిరుమలగిరి, సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని రాంగోపాల్‌పేట్‌, గాంధీనగర్‌ పోలీస్టేషన్ల పరిధుల్లో ఉండే అన్ని మద్యం దుకాణాల మూసివేయించారు.

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశాలు జారీచేశారు. బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo