సోమవారం 25 మే 2020
Telangana - Feb 19, 2020 , 13:14:24

127 మందికి నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన యూఐడీఏఐ

127 మందికి నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన యూఐడీఏఐ

హైద‌రాబాద్:  హైద‌రాబాద్‌లో త‌ప్పుడు ఆధారాల‌పై ఆధార్ కార్డు తీసుకున్న 127 మందికి యూఐడీఏఐ నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే.  అయితే ఆ నోటీసుల‌పై ఇవాళ యూఐడీఏఐ క్లారిటీ ఇచ్చింది. త‌నిఖీలో భాగంగా విచార‌ణ‌ ఆఫీసు ముందు హాజ‌రుకావాలంటూ ఆ 127 మందికి నోటీసులు ఇచ్చిన‌ట్లు యూఐడీఏఐ చెప్పింది.  వ‌రుస ట్వీట్ల‌లో ఇవాళ ఆ విషయాన్ని తెలియ‌జేసింది.  అయితే మీడియాలో వ‌స్తున్న వార్త‌లు స‌క్ర‌మ ప‌ద్ధ‌తిలో లేవ‌ని, పౌర‌స‌త్వ ఇష్యూతో ఆధార్ నోటీసుల‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ఆ ట్వీట్ల‌లో యూఐడీఏఐ స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర పోలీసుల నుంచి స‌మాచారం మేర‌కే మాత్ర‌మే.. రీజిన‌ల్ ఆఫీస‌ర్ ఆ 127 మందికి నోటీసులు జారీ చేసిన‌ట్లు యూఐడీఏఐ తెలియ‌జేసింది.  ఆధార్ యాక్ట్ ప్ర‌కారం ఆ నెంబ‌ర్ల‌ను ర‌ద్దు చేయాల‌న్న‌ది, కానీ ఆ 127 మందిని ఈనెల 20వ తేదీన రీజిన‌ల్ ఆఫీసు ముందు హాజ‌రుకావాల‌ని కోరాం, ఇప్పుడు ఆ ఎంక్వైరీని మే నెల‌కు వాయిదా వేసిన‌ట్లు యూఐడీఏఐ చెప్పింది.  గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో త‌లాబ్‌క‌ట్ట‌లో ఉన్న భ‌వానీన‌గ‌ర్‌లోని మీసేవా కేంద్రంపై టాస్ ఫోర్స్ ద‌ళాలు దాడి చేశాయి. ఆ కేసులో ఇద్ద‌ర్ని అరెస్టు చేశారు.  బాలాపూర్‌, కంచ‌న్‌బాగ్‌లో ఉంటున్న కొంద‌రు అక్ర‌మ శ‌ర‌ణార్థులు కూడా ఆధార్ కార్డు క‌లిగి ఉన్న‌ట్లు గుర్తించారు. 


logo