గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 17:16:45

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: మంత్రి కొప్పుల

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: మంత్రి కొప్పుల

హైదరాబాద్‌: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా తెలుగు నూతన సంవత్సరాదిని సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భగవంతుడు ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు.

ఉగాది పర్వదినాన్ని ప్రజలంతా తమ ఇంట్లోనే జరుపుకోవాలని మంత్రి విన్నవించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో అందరి శ్రేయస్సు దృష్ట్యా.. పండుగను గుళ్లు, గోపురాలకు వెళ్లకుండా ఇంటి వద్దే చేసుకుందామన్నారు. సర్వమానవాళి శ్రేయస్సు కోరుకోవడం మన ధర్మమనీ.. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మనం కఠిన నియమాలు పాటించకతప్పదని మంత్రి తెలిపారు.


logo
>>>>>>