మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:28

టీడబ్ల్యూఆర్డీసీ చైర్మన్‌ ప్రకాశ్‌

టీడబ్ల్యూఆర్డీసీ చైర్మన్‌ ప్రకాశ్‌

  • పదవీకాలం ఏడాది పొడిగింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాదికాలం పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 2017 మార్చి ఒకటిన ప్రకాశ్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీతో ఆయన మూడేండ్ల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో సంవత్సరం పెంచింది.


logo