శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 02:46:36

టీ-వర్క్స్‌ వెంటిలేటర్‌ సిద్ధం

టీ-వర్క్స్‌ వెంటిలేటర్‌ సిద్ధం

  • యంత్రం సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న నిమ్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘టీ-వర్క్స్‌' సరికొత్త వెంటిలేటర్‌ను ఆవిష్కరించింది. తక్కువ ధరకే వెంటిలేటర్‌ను ఉత్పత్తిచేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధిచేసింది. ప్రస్తుతం ఈ పరికరం సామర్థ్యాన్ని నిమ్స్‌లో పరీక్షిస్తున్నారు. ప్రయోగాలు విజయవంతమైతే పెద్దఎత్తున ఉత్పత్తిచేసి, సరఫరాచేయాలని భావిస్తున్నారు. వెంటిలేటర్‌ అభివృద్ధిలో నిమ్స్‌ వైద్యులు కీలకపాత్ర పోషించారని టీవర్క్స్‌ సీఈవో సుజయ్‌ కారంపూరి పేర్కొన్నారు. జిల్లా, ఏరియా దవాఖానల్లో ఈ పరిరం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిమ్స్‌ అనస్తీషియా విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ పద్మజ చెప్పారు. అంబులెన్సుల్లో వినియోగించవచ్చని, దీంతో రోగుల ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు.


logo