గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 12:59:26

ఇంజాపూర్ వాగులో ఇద్ద‌రు యువ‌కుల మృత‌దేహాలు లభ్యం

ఇంజాపూర్ వాగులో ఇద్ద‌రు యువ‌కుల మృత‌దేహాలు లభ్యం

హైద‌రాబాద్‌: రెండు రోజుల క్రితం ఇద్ద‌రు యువ‌కులు పానీపూరి తినివ‌స్తామ‌ని ఇంట్లో నుంచి వెళ్లారు. జోరుగా వాన‌ప‌డుతున్న‌ది. దీంతో ఇద్ద‌రు తిరిగి ఇంటికి చేరుకోలేక‌పోయారు. క‌న్పించ‌కుండా పోయిన ఇద్ద‌రు యువ‌కుల మృత‌దేహాలు న‌గ‌ర శివార్ల‌లోని ఇంజాపూర్ వాగులో ల‌భ్య‌మ‌య్యాయి. తొర్రూరులోని రాజీవ్ గృహ‌క‌ల్ప‌కు చెందిన ప్ర‌ణ‌య్ (16), జ‌య‌దీప్ (19) రెండు రోజుల క్రితం ప‌క్క‌నే ఉన్న ఇంజాపూర్‌లో పానీపూరీ తిందామ‌ని వెళ్లారు. భారీ వాన‌ల‌తో ఇంజాపూర్ వ‌ద్ద గ‌ల్లంత‌య్యారు. వారిరువురు తుర్కయంజాల్ చెరువు ప్ర‌వాహంలో కొట్టుకుపోయార‌ని పోలీసులు తెలిపారు. ఇంజాపూర్ వ‌ద్ద వాగులో ఇద్ద‌రు యువ‌కుల మృత‌దేహాలు ఈరోజు ల‌భ్య‌మ‌య్యాయి. వారి మృత‌దేహాల‌ను పోలీసులు వెలికితీశారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo