ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Mar 26, 2020 , 22:26:26

చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

కామారెడ్డిరూరల్‌ : చెరువులో బర్రెలకు నీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మద్దికుంట రాజశేఖర్‌(19), మద్దికుంట రణదీప్‌(19) గురువారం ఉదయం బర్రెలకు నీళ్లు పట్టేందుకు గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. వీరు సైతం దుస్తులు విప్పి చెరువులో దిగారు. 

ఇద్దరికీ ఈత రాకపోవడంతో వారు మునిగిపోయారు. గట్టుపై దుస్తులను ఇది గమనించిన ఇతర కాపరులు వెంటనే కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వారిని  బయటకు తీయగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. వీరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌ పేర్కొన్నారు.logo