శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 22:42:18

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

దేవరకద్ర  : మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్‌పల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  మినీ ట్రక్కు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన సాయికుమార్‌(19), చంద్రబాబు(23) స్నేహితులు. సాయికుమార్‌ తండ్రి రిటైర్డ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కుర్మయ్య డయాబెటిక్‌, హార్ట్‌పేషెంట్‌. అతనికి మందులు తీసుకురావడానికి  జిల్లా కేంద్రానికి వెళ్లి తిరుగు ప్రయాణం కాగా.. రాయిచూర్‌ నుంచి వస్తున్న అశోక్‌ లేలాండ్‌ మినీట్రక్కు చౌదర్‌పల్లి గ్రామ శివారులో కాకతీయ పాఠశాల సమీపంలో బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను జిల్లా జనరల్‌ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. 


logo