సోమవారం 01 మార్చి 2021
Telangana - Jan 16, 2021 , 22:45:14

రామునిప‌ట్ల వ‌ద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్ద‌రు మృతి

రామునిప‌ట్ల వ‌ద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్ద‌రు మృతి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో హైద‌రాబాద్‌-క‌రీంన‌గ‌ర్ రాజీవ్ ర‌హ‌దారిపై రెండు బైక్‌లు డీకొన‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం సిద్ద‌న్న‌పేట గ్రామ వాసి క‌డ‌వ రామ‌చంద్రం (45), ఇబ్ర‌హీంన‌గ‌ర్ వాసి వాన‌రాశి ర‌మేశ్ (35) శ‌నివారం రాత్రి 7.40 గంట‌ల స‌మ‌యంలో రామునిప‌ట్ల గ్రామ శివారుల్లో రాజీవ్ ర‌హ‌దారిపై ఎదురెదురుగా బైక్‌ల‌పై వెళుతున్నారు.

క‌డ‌వ రామ‌చంద్రం బైక్‌ను ర‌మేశ్ అతివేగంతో ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. ర‌మేశ్‌, రామ‌చంద్రం అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా, ఈ ఘ‌ట‌న‌లో రామ‌చంద్రం కూతురు, మ‌నుమ‌రాలికి గాయాల‌య్యాయి. ఇద్ద‌రి మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం సిద్దిపేట ప్రాంతీయ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo