గురువారం 09 జూలై 2020
Telangana - Apr 06, 2020 , 10:04:16

నిర్మల్‌ జిల్లాలో మరో రెండు కరోనా కేసులు

నిర్మల్‌ జిల్లాలో మరో రెండు కరోనా కేసులు

నిర్మల్‌: జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి.  జిల్లాలోని చాక్ పెళ్లి గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరిద్దరు కూడా ఇటీవల ఢిల్లీ మర్కజ్ ప్రార్థనా సమావేశాలకు వెళ్లి వచ్చారు. జిల్లాకు చెందిన మరో అరవై మందికి సంబంధించిన నిర్ధారణ నివేదిక రావాల్సి ఉంది.  దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు ఐదుకు చేరుకున్నాయి.  ఇప్పటికే ఇద్దరు కరోనా వైరస్ కారణంతో మృతి చెందగా, మరో  ముగ్గురికి పాజిటివ్‌  ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. బైంసా పట్టణంలో కలెక్టర్ పర్యటించారు. 


logo