శనివారం 04 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 16:03:48

నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్

నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్

నాగర్ కర్నూల్ : జిల్లాలోని బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతడి అంత్యక్రియలకు హాజరైన14 మంది వ్యక్తుల శాంపిల్స్ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించారు. పరీక్షల్లో అదే గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, మిగతా12 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ కోరారు. కరోనా తీవ్రతను గుర్తించి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు దుకాణాల్లో గుంపులు గుంపులుగా ఉండకూడదని తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.


logo