గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 21:18:21

ట్విట్ట‌ర్ స్టార్‌.. కేటీఆర్‌కు 20 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు

ట్విట్ట‌ర్ స్టార్‌.. కేటీఆర్‌కు 20 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు

హైద‌రాబాద్: ఇది అరుదైన ఘ‌ట‌న‌. ఓ అద్భుత‌మైన మైలురాయి. తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణ అభివృద్ధి, ఐటీశాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు.. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో దూసుకువెళ్తున్నారు.  డైన‌మిక్ మంత్రి కేటీఆర్‌ను ట్విట్ట‌ర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 20 ల‌క్ష‌లు దాటింది.  ఇది నిజంగా అత్యంత అరుదైన ఘ‌ట‌న‌. ప్ర‌తి నిత్యం ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌ట‌న‌లే కాకుండా.. అనుక్ష‌ణం ట్విట్ట‌ర్‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తున్న‌ మంత్రి కేటీఆర్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే 20 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్నారు. 

2010 మార్చి 10వ తేదీన ట్విట్ట‌ర్ ఖాతా ఓపెన్ చేసిన కేటీఆర్‌.. ప్ర‌తి ప్ర‌భుత్వ స‌మాచారాన్ని త‌న ట్వీట్‌తో ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్నారు. అత్యంత చురుకుగా ప‌నిచేస్తున్న కేటీఆర్‌ను.. రాష్ట్ర ప్ర‌జ‌లే కాదు, దేశ‌విదేశాల నుంచి కూడా ఆయ‌న్ను ఫాలో అవుతున్నారు. సాయం కావాల‌ని అభ్య‌ర్థించిన వారికి మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్ల‌తోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్న వైనం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న‌ది.  ట్విట్ట‌ర్ ఖాతా తెరిచాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయ‌న ఎన్నో ట్వీట్స్ చేశారు. ఇక రాష్ట్రం ఏర్ప‌డి మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన త‌ర్వాత కేటీఆర్ శైలి మ‌రింత‌ దూకుడుగా మారింది. 

2018 ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన కేటీఆర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ప‌ది ల‌క్ష‌లకు చేరుకున్న‌ది.  మిలియ‌న్ మార్క్‌ను కూడా కేటీఆర్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే అందుకున్నారు.  ప్ర‌జాసంక్షేమాన్ని, సుప‌రిపాల‌న‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌తో అందిస్తూ ఆ సేవ‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేశారు. ట్విట్ట‌ర్ ఆయుధంగా మంత్రి కేటీఆర్ ఈ-గ‌వ‌ర్నెన్స్ అందించిన తీరు అంద‌ర్నీ స్ట‌న్ చేసింది. తాజాగా కోవిడ్19 మ‌హ‌మ్మారిపై జ‌రుగుతున్న పోరును కూడా ఆయ‌న త‌న ట్వీట్ల‌తో ప‌రిష్క‌రిస్తున్న వైనం ఆక‌ట్టుకుంటున్న‌ది. గంభీర‌మైన స‌మ‌స్య‌కు గంభీరంగా స్పందిస్తూ.. సున్నిత‌మైన అంశాల‌కు అదే రీతిలో ట్వీట్ చేస్తూ .. ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ మ‌రింత చేరువ‌వుతున్నారు.  ట్విట్ట‌ర్‌లో 20 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్ల‌తో కేటీఆర్ మ‌రో మైలురాయిని అందుకున్నారు. 


logo