మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 18:27:35

మావోయిస్టు సానుభూతిప‌రులు ఇద్ద‌రు అరెస్టు

మావోయిస్టు సానుభూతిప‌రులు ఇద్ద‌రు అరెస్టు

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : మావోయిస్టు సానుభూతిప‌రుల‌ను ఇద్ద‌రిని పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటుచేసుకుంది. మ‌ణుగూరు ఏఎస్పీ పి. శ‌బ‌రీష్ మీడియాతో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. బుగ్గ క్రాస్ రోడ్డు వ‌ద్ద పోలీసు సిబ్బంది వాహ‌నాల త‌నిఖీ చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో అనుమానాస్ప‌దంగా తిరుగుతున్న ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. విచార‌ణ‌లో మ‌ణుగూరు మండ‌లం బుడుగుల గ్రామ నివాసి ప‌ద్దాం సోమ‌య్య‌గా తెలిపాడు. 

కాగా ఇత‌ను ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ర్టం సుక్మా జిల్లాలోని గొంగే గ్రామానికి చెందిన‌వాడు. సీపీఐ(మావోయిస్టు) పార్టీకి సానుభూతిప‌రుడిగా అంగీక‌రించాడు. స్థానిక మావోయిస్టు పార్టీ స‌భ్యుల‌కు సేవ‌లు అందిస్తున్నాడు. వారికి ఆశ్ర‌యం క‌ల్పించ‌డం, అవ‌స‌ర‌మైన వ‌స్తువులు అందించ‌డం వంటి ప‌నులు చేస్తుంటాడ‌న్నారు. నిందితుడి వ‌ద్ద నుంచి న‌క్స‌ల్స్ వాల్ పోస్ట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.  

అదేవిధంగా జిల్లాలోని ఎదుల్లా బ‌య్యారం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మ‌రో మావోయ‌స్టు సానుభూతిప‌రుడిని అరెస్టు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. నిందితుడిని పినపాక మండలంలోని పిట్టటోగుకు చెందిన చిమల రవి అలియాస్ భీమాగా గుర్తించారు. 


logo