మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 06:57:15

ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్టు

ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వ నిషేదిత సంస్థ మావోయిస్టు మిలీషియాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల రూరల్‌ కలివేరు క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. చర్ల పోలీసులు కలివేరు క్రాస్‌రోడ్డులో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అటువైపుగా ఇచ్చిన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

యువకుల్లో ఒకరు బట్టిగూడెం గ్రామానికి చెందిన సోడి సన్నా(18), మరొకరు ఎర్రంపాడుకు చెందిన మూసిక ఊరె(18). ఇరువురు గతకొంతకాలంగా మావోయిస్టు పార్టీ మిలీషియా కమిటీలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఇరువురిని అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపర్చనున్నట్లు చర్ల పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు.

ఐదు కిలోల ఐఈడీ స్వాధీనం...

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా పరిధి రావాస్‌ అటవీప్రాంతంలో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల దాటికి తట్టుకోలేక మావోయిస్టులు అక్కడినుంచి పారిపోయారు. సంఘటనా స్థలంలో తనిఖీ చేపట్టగా ఐదు కిలోల అత్యంత శక్తివంతమైన ఐఈడీ బాంబును కనుగొన్నారు. ఐఈడీని నిర్వీర్యం చేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాల్పుల ఘటనను ఏఎస్పీ కీర్తన్‌ రాథోడ్‌ ధృవీకరించారు. 


logo