మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 07:54:59

వ్యాన్‌, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

వ్యాన్‌, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

న‌ల్ల‌గొండ‌: జిల్లాలోని కొండ‌మ‌ల్లెప‌ల్లిలో రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. ఈరోజు ఉద‌యం కొండ‌ల‌మ‌ల్లెప‌ల్లి వ‌ద్ద మోటార్ సైకిల్‌ను ఓ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌ర‌ణించిన‌వారిని మండ‌లంలోని దోన్యాల‌కు చెందిన స‌తీశ్‌, లింగ‌య్య‌గా గుర్తించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరిన ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వ్యాన్ డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేశారు.