ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 21:58:39

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

జయ శంకర్ భూపాలపల్లి : గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా  కాళేశ్వరం ప్రధాన రహదారిపై బొగ్గుల వాగు వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మలహర మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాకేష్(18) భూపాలపల్లికి చెందిన రోహిత్ (19) స్నేహితులు. ఇద్దరు భూపాలపల్లి నుంచి బైక్‌పై రుద్రారం వెళ్తుండగా బొగ్గుల వాగు సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. బైక్‌ అమాంతం గాలిలో ఎగిరిపడటంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.